Blogger Widgets తెలుగు బ్లాగ్: నడిపించు నా నావ .. lyrics
More Telugu Songs Lyrics ... Coming soon

Thursday, January 26, 2012

నడిపించు నా నావ .. lyrics


నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప 
                                                                .... నడిపించు ....
1  నా జీవిత తీరమున  - నా అపజయ భారమున
    నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు 
   నా ఆత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప 
   నా నావలో కలిడుము - నా సేవ జేకొనుము   
                                                                .... నడిపించు ....
2 . ప్రభు మార్గము విడిచితిని - ప్రార్ధించుట మానితిని 
     ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని  
     ప్రపంచ నటనలలో - ప్రవీన్యమును బొంది 
    ఫలహీనుడనై ఇప్పుడు - పాటింతు నీ మాట 
                                                                .... నడిపించు ....
౩.  లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా 
    లోబడు టను నేర్పించి - లోపంబులు సవరించి 
   లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు 
  లోపించని యర్పనగా - లోకేశ చేయుమయా .
                                                                .... నడిపించు ....
4  ప్రభు యేసు సిస్యుడనై - ప్రభు ప్రేమలో పాతుకొని 
   ప్రకటింతును లోకములో - పరిసుద్దుని ప్రేమ కథ
   పరమాత్మా ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో 
   ప్రానంబును ప్రభు కొరకు - పానర్పణ చేతున్ 
                                                                .... నడిపించు ....

No comments:

Post a Comment